Friday, January 3, 2025

లోయలోకి దూసుకెళ్లిన బస్సు..ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్నవారిని రెస్కూ సిబ్బంది కాపాడారు. గుజరాత్‌కు చెందిన 35 మంది యాత్రికులు ప్రైవేట్ బస్సులో గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి వెళ్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ బస్సు అదుపు తప్పి రోడ్డు దిగువన ఉన్న లోయ లోకి దూసుకెళ్లింది.

ఏడుగురు యాత్రికులు మరణించగా, అందులో చిక్కుకున్న 27 మందిని రెస్కూ బృందాలు రక్షించాయి. తాళ్ల సాయంతో వారిని రోడ్డు పైకి తెచ్చారు. బస్సులో ఇరుక్కుపోయిన వ్యక్తిని అతికష్టం మీద కాపాడగలిగారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News