మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజాసంఘాల జె.ఎసి రాష్ట్ర ఛైర్మన్ గజ్జెల కాంతం ముద్దుల తనయ చిన్నారి తన్మయి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని గజ్జెల కాంతం స్వగృహం నందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పౌండర్, రాజ్యసభ సభ్యులు జోగిన పల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, చొప్పదండి శాసన సభ్యులు సుంకే రవిశంకర్, మాజీ శాసన సభ్యులు అరేపల్లి మోహన్, తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి రాష్ట్ర చైర్మెన్ గజ్జెల. కాంతం, భారత ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాతీయ అద్యక్షులు గంథం రాములు, తెలంగాణ పూసల, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్‌లతో కలిసి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ వారి భాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు, పెద్దలు సంతోష్ కుమార్ చేపట్టినా గ్రీన్ ఇండియ ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మి కుంట మాజీ మున్సిపల్ చైర్మన్ పొడేటి రామస్వామి, బొంకూరి. సురేందర్ సన్ని, డాక్టర్ సంజీవ్ నాయక్, బత్తుల పాండు, గజ్జెల ఆనందరావు, సుద్దాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.