Saturday, November 23, 2024

పరుగుల క్రీడాకారులకు సర్కారు ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

పిటి ఉషా లాంటి వారు రాష్ట్రం నుండి రావాలన్నదే కెసిఆర్ ఆశయం
అథ్లెటిక్స్ స్టేట్ మీట్ లో శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : అన్ని రంగాల్లో యువతరాన్ని విజేతలుగా నిలపడం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అందిస్తున్న ప్రోత్సాహన్ని ఉపయోగించుకొని విశ్వ విజేతలుగా ఎదగాలని రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ నవతరానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మిడిల్, లాంగ్ డిస్టెన్స్ మీట్ ను హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్ అర్టిలరి సెంటర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో క్రీడా కారులు ఈ రాష్ట్ర స్థాయి పరుగుల పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టోర్ట్ అథారిటీ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి కూడా ప్రముఖ అథ్లెట్లు పిటి ఉషా, ఉసేన్ బోల్ట్‌లు రావాలన్నదే కెసిఆర్ ప్రభుత్వ ఆశయమన్నారు. తెలంగాణ యువత ఒలంపిక్స్‌లో బంగారు పతకాలు సాధించి, రాష్ట్ర ప్రతిష్టను విపణి కి చాటాలన్నారు. గత కొన్నేళ్లుగా యువ క్రీడాకారులకు మార్గదర్శకత్వం వహించడంలో పిటి ఉష తదితరులు అద్భుతంగా పనిచేశారని ఆంజనేయ గౌడ్ గుర్తు చేశారు.

ఈ క్రమంలో స్వరాష్ట్రంలో క్రీడా రంగంలో కూడా ఆత్మ విశ్వాసం పెరిగిందని, నిఖత్ జరీన్, ,ఉసాముద్దీన్, నందిని, ఈషా సింగ్ తదితర రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారని వివరించారు. పల్లెల్లోంచి ప్రపంచ ఛాంపియన్‌లు రావడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఈ సందర్భంగా మిడిల్ , లాంగ్ డిస్టెన్స్, పరుగు పందెం పోటీల విజేతలకు మెడల్స్ , సర్టిఫికేట్స్‌ను ఆయన అందజేశారు. ఈ స్టేట్ మీట్‌లో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు స్టాన్లీ జోన్స్, సారంగపాణి, ప్రతినిధులు ప్రొఫెసర్ రాజేష్, ద్రోణాచార్య అవార్డీ రమేష్,వెంకటేశ్వర్ రెడ్డి, స్వాములు తదితరులు పాల్గొన్నారు.

sports 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News