కంటోన్మెంట్: భార్యతో గొడవపడిన ఓ భర్త భార్య చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.. ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల సూరానికి చెందిన సుబ్రమ ణ్యం (30) విజేతను ప్రేమ వివాహం చేసుకుని న్యూ బోయినపల్లిలోని చిన్నతోకట్టలో నివాసముంటూ పెయింటర్‌గా పనిచేస్తూ భార్య, తల్లి నా గమణిలను పోషిస్తున్నాడు. రెండు నెలల క్రితం సుబ్రహ్మణ్యంకు కుమారుడు జన్మించాడు.అయితే గతకొంతకాలంగా సుబ్రమణ్యం అతని భార్య విజేత మ ధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమమంలో శనివారం ఏమిజరిగిందో కానీ విజేత తన కుమారుడుని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్ళిపోయి రాత్రి 8గంటల సమయంలో ఇంటికి తిరిగివచ్చింది. ఇంట్లో తలుపులు తీయమని భర్తను కోరగా అతనివద నుండి సమాధానం రాలేదు. దీంతో కిటికీలోంచి చూడగా భర్త సుబ్రమణ్యం ఇంట్లోని ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో షాక్ కు గురైన విజేత వెంటనే విషయాన్నీ బయట వేరే వారి ఇంట్లో వున్న సుబ్రమణ్యం తల్లి నాగమణికి తెలిపింది. ఇంతలో అక్కడకు చేరుకున్న నాగమణి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారాన్ని అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న బోయినపల్లి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు