Monday, December 23, 2024

మాలలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలి : రమేష్‌బాబు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : మాలలకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ పదవుల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోపోజు రమేష్ బాబు డిమాండ్ చేశారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో, దళిత ఉద్యమాలలో మాలలు ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక మాల ఎంపీ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రం లోని రాజకీయ పార్టీలు మాలలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అందువలన మాలలు ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానం చేసినట్టు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు మాలలకు అత్యధిక ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కేటాయించాలని, లేనిపక్షంలో మాలల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్ లలో 50% మాలకే కేటాయించాలని పార్టీ పదవుల్లో ప్రభుత్వ పదవుల్లో మాలలకు స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎస్సీల జనాభా 22 శాతం ఉన్నందువలన ప్రస్తుతం రిజర్వుడ్ అయిన 19 ఎమ్మెల్యే స్థానాల కంటే ఎక్కువ స్థానాలు ఎస్సీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ సలహాదారులు కొండ్ర రాజలింగం, మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ రావు, జాతీయ కార్యదర్శి శ్రవణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు, రాష్ట్ర నాయకులు రాందాస్ కోటేశ్వరరావు, అశోక్ ,నగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News