Friday, December 20, 2024

రాత్రంతా మహిళపై పోలీస్‌స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ

- Advertisement -
- Advertisement -

ఎల్బీ నగర్ పోలీసులపై కేసు నమోదు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎల్బీనగర్ లో మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై ఇదివరకే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని డీజీపీ, సీఎస్ లను ఆమె ఆదేశించారు. తాజాగా ఆదివారం నాడు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. రాచకొండ సీపీ చౌహాన్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారని ఆమె తెలిపారు. దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు.

ఓ మహిళను స్వాతంత్య్ర దినోత్సవం రోజు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి దాడి చేసిన ఘటనలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్, ఓ ఎస్‌ఐపై 324, 354, 379, ఎస్‌సి ఎస్‌టి పిఒఎ యాక్ట్ 2015 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితురాలి కూతురు పూజ ఫిర్యాదుతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 15న తన అంకుల్ చందుకి 3 లక్షల నగదు తీసుకెళ్తుండగా పోలీసులు డబ్బులు లాక్కుని దాడి చేశారని పిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లి తొడలు, మొకాళ్లు, చేతులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం పేరుతో దూషిస్తూ తల్లి పై దాడి చేశారని బాధితురాలి కూతురు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News