సిటీ బ్యూరో: సినీ సాహితీ చరిత్రలో డాక్టర్ సి. నారాయణరెడ్డిది ఓ నవశకం అని అమెరికా నార్త్ కరోలినా చార్లట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్, సాహితీ విశ్లేషకులు పండ్ర పగడ రామారావు అన్నారు. సినారే 93 వ జయంతిని పురస్కరించుకొని ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో అమెరికాలోని ఆదివారం చార్లెట్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రామారావు విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సినారే తన 5 దశాబ్దాల సినీ సాహిత్యాన్ని గులేబ కావలి కథ చిత్రం నుంచి అరుంధతి చిత్రం వరకు ఆయన పాటల్లోని మధిరిమలను, లాలిత్యాన్ని, సమాజ శ్రేయస్సును విపులంగా వివరించారన్నారు… సన్నివేశ పరంగా, సహజత్వానికి దగ్గరగా ఆయన పాట రచన సాగేదని కొనియాడారు. ఆకృతి సుధాకర్ మాట్లాడుతూ తన ప్రత్యక్ష గురువైన సినారే జయంతినీ ఇక్కడ జరుపడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రా మారావు, భార్గవి దంపతులను వారి వివాహ రజతోత్సవ వేడుకలను నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చార్లెట్ నగరంలోనీ పలువురు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.