Sunday, January 19, 2025

భారత్‌కు రెండో విజయం

- Advertisement -
- Advertisement -

మలాహైడ్ : వరుస విజయాలతో యంగ్ టీమిండియా దూసుకుపోతోంది. ఐర్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణిస్తోంది. అతిధ్య ఐర్లాండ్ జట్టుతో ఆదివారం జరిగిన రెండో టి20లో 33 పరుగులతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 02తో ఆధిక్యంలో నిలిచింది. 185 పరుగుల లక్ష ఛేదనకు దిగిన ఐర్లాండ్ టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులే చేసింది.

Also Read: లద్దాఖ్ మృతుల్లో మన వీర జవాన్

అతిధ్య ఐర్లాండ్ జట్టులో ఆండ్రేవ్ బల్బిర్నె(72), మార్క్ అడైర్(23) తప్ప మరెవరూ క్రీజులో నిలవలేకపోయారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కిషన్, రవి బిషోణయ్ తలో రెండేసి వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లతో రుతురాజ్ గైక్వాడ్(58) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సంజు శాంసన్(40), రింకు సింగ్(38), శివం దూబే(22)లు రాణించడంతో 20 ఓవర్లతో 5 వికెట్లు కోల్పోయి 185 పరగులు చేసి, ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News