Wednesday, April 2, 2025

కబడ్డీ టోర్నమెంట్‌లో కత్తులతో బీభత్సం(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కబడ్డీ టోర్నమెంట్‌లో రెండు వర్గాలు కత్తులు, తుపాకులతో తలపడ్డాయి. బ్రిటన్‌లోని డెర్బీలో ఎల్వాస్టన్‌లోని కబడ్డీ మైదానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. భయాందోళన చెందిన ప్రేక్షకులు మైదానం నుంచి తమ పరుగులు తీశారు.

కబడ్డీ టోర్నమెంట్‌కు హాజరైన వీక్షకుల్లో రెండు వర్గాలు కత్తులు, తుపాకులతో ఘర్షణ పడడంతో తమ ప్రాణాలను దక్కించుకునే క్రమంలో ప్రేక్షకులు తమ కార్ల వద్దకు పరుగులు తీయడం సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఒక వీడియోలో కనిపించింది. టోర్రమెంట్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు మద్యాన్ని ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారని, వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని, ముగ్గురినీ ఆసుపత్రికి తరలించామని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News