హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికలకు బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొద్దిసేపటిక్రితం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్, 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఏడు నియోజకవర్గాల్లో తప్ప మిగతా స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులకే సీటు కేటాయించినట్లు సిఎం తెలిపారు. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థుల పేర్లను పెండింగ్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు. ఇక, ఏడు సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను (115 స్థానాలకు) ప్రకటించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
BRS Party Chief, CM Sri KCR announced the first list of BRS candidates (115 constituencies) for the forthcoming Telangana Assembly… pic.twitter.com/LNLohVSRVm
— BRS Party (@BRSparty) August 21, 2023