- Advertisement -
హైదరాబాద్: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేస్తానని ప్రకటించడం, ఆయన ఓటమిని ఒప్పుకున్నట్టేనని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియతో మాట్లాడుతూ ఇంతమందిని గెలిపించే నాయకుడు రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఏదో ఒక చోట ఓడిపోతానని కెసిఆర్ భయపడ్డారని,
ఆయన భయపడ్డట్లుగానే ప్రజలు రానున్న ఎన్నికల్లో కెసిఆర్‌ను ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. సిఎం కెసిఆర్ కామారెడ్డిలోనే ఎందుకు పోటీ చేస్తున్నారని, సిరిసిల్లలో పోటీ చేయొచ్చు కదా అని రేవంత్ ప్రశ్నించారు. సోనియా నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతు రుణమాఫీ చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
- Advertisement -