కామారెడ్డి: రాష్ట అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు రానున్న తరుణంలో ముందస్తుగానే అధికార పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించడం తో ఎన్నికల వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి తో పాటు ఎల్లా రెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొనసాగుతుండగా అందులో కామారెడ్డికి చెందిన గంపగోవర్దన్ ప్రభుత్వ విప్ గా, పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్‌గా కొనసాగుతున్నారు. నాటకీయ పరిణామాల మద్య కామారెడ్డి స్థానం నుండి సిఎం కెసిఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిడంతో కామారెడ్డితో పాటు మిగితా నియోజకవర్గాలలో బిఆరెఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుంన్నారు. ఎల్లారెడ్డి నుండి జాజాల సురెందర్, జుక్కల్ నుండి హన్మంత్ షిండే, బాన్సువాడ నుండి పోచారం కే సీటు కేటాయించడంతో వారి అనుచరులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుండి గత కొంత కాలంగా కెసిఆర్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది.
కామారెడ్డిలో బిఆరెఎస్ పార్టీ బలహీనపడ్డట్టు ప్రచారం జరుగడంతో పాటు ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ పట్ల వ్యతిరేకత పెరుగుతుండటంతో ద్వితీయశ్రేణి నాయకులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. కామారెడ్డి బరిలో ఎవరు పోటీ చేసినా గెలువరని సిఎం కెసిఆర్ పోటీ చేస్తే సునాయసంగా గెలవడంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూసే అవకాశం ఉటందని బిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. తనను తనకు టికెట్ రాకుండా ప్ర యత్నాలు చేస్తున్నారనే ఉద్దేశంతో గంపగోవర్దన్ సిఎం కెసిఆర్‌ను పోటీ చేయాలని పలుమార్లు సూచించి కెసిఆర్ ను బరిలో దింపి ఆయన అనుకున్నది సాధించాడని పలువురు బిఆర్‌ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు. స్వయంగా సిఎం కెసిఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో పెండింగ్‌లో ఉన్న పనులకు మోక్షం లభించే అవకాశాలు ఉంటాయని అదే భరోసాతో బిఆర్‌ఎస్ పార్టీకి భారీ మెజారిటి వచ్చే అవకాశాలున్నాయని బిఆర్‌ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సిఎం కెసిఆర్‌కు తెలంగాణ ఉద్యమ ఆరంభం నుండి వెన్నుదన్నుగా ఉండి ఉద్యమంలో పాలుపంచుకుని పలు కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు కామారెడ్డి మార్కెట్‌లో శ్రమధానం చేసిన విషమాలు గుర్తు చేసుకుటుంన్నారు. అలాగే ప్రతి విషయంలో కామారెడ్డిపై ఒక విధమైన ప్రేమానురాగాలు ఉన్నాయని అలాగే ఆయనకు కామారెడ్డితో ప్రత్యే కమైన అనుభందం ఉండటం ఆయనకు కలిసి వచ్చే అవకాశాలు పట్టణ ప్రజలు భావిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొదటి నుండి స్థానిక ఎమ్మెల్యే జాజాల సురెందర్ కే టికెట్ వరిస్తుందని భావించారు. నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యా మ్నాయంగా పార్టీలో బలమైన నాయకుడు లేకపోవండంతో కలిసివచ్చినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అలాగే పక్షం రోజుల క్రితం కేటీఆర్ బహిరంగ సభలో కేటీఆర్ సభాముఖంగానే నల్లమడుగు సురెందర్ పోటీ చేస్తున్నారని ఆయన కు ఆశీర్వదించి గెలిపిస్తే ఎల్లారెడ్డి నియోజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది జరు గుతుందని ప్రకటించారు.
అందరు భావించినట్లే జాజాల సురెందర్ టికట్ ఖరారు కావడంతో నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాన్సువాడ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిథ్యం వాహిస్తుండగా ఆయనకు వయోభారం పడుతుండటంతో అతని కుమారులు సురెందరఃవ రెడ్డి, భాస్కర్ రెడ్డిలలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన నియోజకవర్గంలో ఆయన కుమారుల పట్ల వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగడంతోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి టికెట్ కేటాయించినట్లు తెలిసింది. జుక్కల్ నియోజకవర్గం నుండి హన్మంత్ షిండే ప్రాతినిథ్యం వాహిస్తుండగా మల్లి ఆయనకే టికెట్ ఖరారు కావడంతో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. ఏదిఏమైనా అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మల్లి టికెట్ దక్కడంతో బిఆర్‌ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.