Sunday, December 22, 2024

డాక్టర్ సుధాకర్ రావు అనుభవం ఆరోగ్యశ్రీకి అవసరం

- Advertisement -
- Advertisement -

ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్. సుధాకర్ రావు
హాజరైన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్

మనతెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ సుధాకర్ రావు లాంటి అనుభవం గల వైద్యుడి సేవలు ఆరోగ్యశ్రీకి అవసరం అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాక మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రజలకు ఆయన సేవలు చాలా అవసరమని వ్యాఖ్యానించారు. మాజీ ఎంఎల్‌ఎ, డాక్టర్ ఎన్. సుధాకర్ రావు సోమవారం ఆరోగ్య శ్రీట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌ల సమక్షంలో డాక్టర్ సుధాకర్ రావు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ….డాక్టర్ ఎన్ సుధాకర్ రావు లాంటి అత్యంత ప్రతిభావంతుడికి మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సుధాకర్ రావు గారు ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు ఆ పదవికే వన్నె తెచ్చారని పేర్కొన్నారు. ఆయన లాంటి ప్రతిభావంతుడు పాలకుర్తి నియోజకవర్గం చెందిన వారు కావడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆత్మీయులు డాక్టర్ సుధాకర్ రావును ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Arogyasri 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News