Sunday, December 22, 2024

సినీ ఫక్కీలో కారులొంచి రూ.20 లక్షలు అపహరణ

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల: కారు అద్దం పగులగొట్టి సినీ ఫక్కిలో రూ.20 లక్షలను ఎత్తుకెళ్లిన సంఘటన చేవెళ్ల మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు పడిగెల రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం ఇంటి నుంచి బ్యాంకులో డబ్బులు వేసేందుకు నగదును యాక్సిస్ బ్యాంకు లోపలికి తీసుకుని వెళ్లాడు. బ్యాంకులో రద్దీగా ఉండడంతో మళ్లీ రావాలని బ్యాంకు అధికారులు తెలపడంతో నగదును తీసుకుని మళ్లీ బయటకు వచ్చాడు. టూవీలర్స్‌తో అక్కడే మాటు వేసిన దొంగలు అది గమనించి బైక్‌లపై కారును వెంబడించారు. వికారాబాద్ రోడ్డులో గల తనకు తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్లిన బాధితుడిని గమనించిన దొంగలు కారులో మరెవరూ లేకపోవడంతో అదను చూసుకుని డ్రైవర్ సీటు పక్కనగల అద్దాన్ని రాయితో పలగొట్టారు.

ఏదో అద్దం పగిలిన శబ్ధం విన్న బాధితుడు పరుగున కారుకాడికి రాగానే.. దొంగలు అప్పటికే బ్యాగులో ఉన్న రూ.20 లక్షల నగదుతో అక్కడి నుంచి బైక్‌లపై పారిపోయారు. అది గమనించిన బాధితుడు వెంటనే చేవెళ్ల పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏసిపి పరిధిలోని మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్, వికారాబాద్ జిల్లాలోని పూడూరు పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు యాక్సిస్ బ్యాంకుకు వెళ్లి సీసీ పుటేజిలను పరిశీలించారు. అనుమానితులను గుర్తించి వెంటనే పట్టుకుంటామని చేవెళ్ల సీఐ లకా్ష్మరెడ్డి తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News