Friday, December 20, 2024

ట్రాన్స్‌ట్రాయ్ స్కామ్ రాయపాటి, శ్రీధర్ బ్యాంక్ లాకర్లు తెరిచిన ఈడి

- Advertisement -
- Advertisement -

కిలోల కొద్ది బంగారం స్వాధీనం

మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ సిబ్బంది ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. ఈ సందర్భంగా చెరుకూరు శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో కిలోల కొద్ది బంగారం పట్టుబడింది. 9.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల బంగారు నాణేలు, రూ.కోటిన్నర విలువైన బంగారు కడ్డీలను ఈడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, గుంటూరు సహా 9 ప్రదేశాల్లో ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీ ఎంపీ రాయపాటితో పాటు శ్రీధర్ బ్యాంక్ లాకర్లను ఇడి అధికారులు తెరిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News