Tuesday, November 26, 2024

హరీశ్‌రావు బిఆర్‌ఎస్ మూలస్తంభం

- Advertisement -
- Advertisement -

మేమంతా ఆయనకు అండగా ఉంటాం

అమెరికా నుంచి మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

క్రిశాంక్ సహా టికెట్ దక్కని ఆశావహులకు మరో రూపంలో అవకాశం

సిరిసిల్ల నుంచి తనను మళ్లీ బరిలోకి దింపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వైద్యారో గ్య శాఖ మంత్రి హరీశ్‌రావుపై ఎంఎల్‌ఎ మై నంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఖండించారు. ఈ మేరకు కెటిఆర్ ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించిన మన ఎంఎల్‌ఎ ఒకరు మంత్రి హరీశ్‌రావుపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘మేమం తా హరీశ్‌రావు వెంట ఉంటాం. అండగా ఉంటాం’ అని కెటిఆర్ స్పష్టం చేశా రు. పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు ఉ న్నారు. హరీశ్‌రావు బిఆర్‌ఎస్ మూలస్తంభం గా కొనసాగుతారని కెటిఆర్ పేర్కొన్నారు. వ చ్చే శాసనసభ ఎన్నికల్లో భాగంగా ముందుగానే బిఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ విడుదల చేశారు.

119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు సంబురాల్లో మునిగిపోగా, టికెట్లు దక్కని అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. ఈ సందర్భం గా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వి ట్టర్ వేదికగా తమ సందేశాన్ని తెలియజేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్ ఎంఎల్‌ఎ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులందరికీ అభినందనలను ట్విట్టర్ వేదికగా తెలిపా రు. తనను మళ్లీ సిరిసిల్ల నియోజకవర్గం నుం చి అసెంబ్లీ ఎన్నికలకు నామినేట్ చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సామర్థం కలిగిన కొంత మం ది నాయకులకు దురదృష్టవశాత్తూ టికెట్లు లభించలేదు. ఉదాహరణకు క్రిశాంక్‌తో పాటు అలాంటి కొంత మంది నాయకులకు అవకాశం రాలేదు. వీరందరికి ప్రజలకు సేవ చేసేందుకు మరొక రూపంలో అవకాశం ఇస్తామని కెటిఆర్ ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News