Saturday, December 21, 2024

మహిళా పోలీస్ అధికారి, కూతురును చంపి… 15 కిలో మీటర్ల దూరంలో భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహిళా పోలీస్ అధికారి ఐనా భార్య, కూతురును భర్త చంపి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కిశోర్ కుట్, వర్ష కుట్ అనే దంపతులు చిక్లీ సిటీలోని పంచముఖి మహాదేవ్ దేవాలయంలో నివసిస్తున్నారు. వర్ష కుట్ పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తోంది. ఈ దంపతులకు మూడేళ్లు, ఎనిమిదేళ్ల కూతురు ఉంది. వర్ష కుట్, మూడేళ్ల కూతురు రక్తపు మడుగులో ఇంట్లో కనిపించడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిశోర్ కుట్ మాత్రం ఇంటి నుంచి 15 కిలో మీటర్ల దూరంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు ఎనిమిదేళ్ల కూతురు స్కూల్‌లో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: మహిళా బిల్లు దానికి ముడిపెట్టొద్దు: కవిత

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిశోర్ తన భార్య, కూతురుపై పదునైన ఆయుధంతో దాడి చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకు హత్య చేశాడు అనే విషయం తెలియడంలేదు. కిశోర్, వర్ష దంపతుల మధ్య గొడవలు లేవని, ఆదర్శ దంపతులుగా ఉండేవారిని స్థానికులు, బంధువులు తెలిపారు. కట్టుకున్న భార్య, కూతురును ఎందుకు చంపారనే విషయం తెలియడం లేదు. పెద్ద కూతురును ప్రశ్నిస్తే కొన్ని విషయాలు బయటకు తెలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. వర్ష తల్లిదండ్రులు, కిశోర్ తల్లిదండ్రుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News