- Advertisement -
ఆదిలాబాద్: బోథ్ ఎంఎల్‌ఎ రాథోడ్ బాపూరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడంలేదని, ఎవరు కుట్రలు చేశారో తెలియడంలేదని తెలిపారు. రాజకీయాల్లో ఆరోపణలు రావడం సహజమేనని, తాను బిఆర్‌ఎస్‌లోనే ఉంటానని బాపూరావు స్పష్టం చేశారు. అధిష్టానం, బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయమే తనకు శిరోధార్యమని, ఇప్పటివరకు ఏ హామీ రాలేదని, తాను అడగలేదన్నారు.
- Advertisement -