Monday, December 23, 2024

ఐఎండిబిలో చిరు అత్యధిక రేటింగ్ చిత్రాలు..

- Advertisement -
- Advertisement -

చిరంజీవిగా అభిమానులకు సుపరిచితుడైన కొణిదెల శివశంకర వర ప్రసాద్ మంగళవారం తన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చిరు నట ప్రస్థానం 35 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉంది. అందులో ఇంట్లో రామయ్య వీడిలో కృష్ణయ్య, శుభలేఖ, శంకర్ దాదా జిందాబాద్, రుద్ర వీణ వంటి అనేక బాక్సాఫీస్ విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రగతిశీల ఆదర్శంగా పేరు పొందాడు.

నటుడిగా నాలుగు నంది అవార్డులు, 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు చిరు అందుకున్నారు. దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ అవార్డు లభించింది.

ఐఎండిబిలో అత్యధిక రేటింగ్ పొందిన చిరంజీవి చిత్రాలు:

1) రుద్ర వీణ – 8.6
2) శ్రీ రాంబంటు – 8.5
3) స్వయం క్రుషి – 8.4
4) మనవూరి పాండవులు – 8.4
5) కిరాయి రౌడీలు – 8.4
6) కొత్త అల్లుడు – 8.4
7) చంటబ్బాయి – 8.3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News