Tuesday, December 24, 2024

పేద వర్గాలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలి

- Advertisement -
- Advertisement -
  • డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్. రెడ్యానాయక్

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన పేద వర్గాలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ధరణి సూపర్ స్పెషలిటీ ఆస్పత్రి వైద్యులు తోడ్పాటు అందించాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్. రెడ్యానాయక్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను మేనేజ్‌మెంట్ వారు రెడ్యానాయక్‌కు చూపించి ఆయా అత్యాధునిక పరికరాలు, వార్డులు, ఆస్పత్రి ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ ఈ ఆస్పత్రిని అత్యాధునికమైన సౌకర్యాలతో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రత్యేకంగా కార్పోరేట్ స్థాయిలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ప్రత్యేక అధునిక వైద్య చికిత్సలు అందించి తోడ్పాడాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మేనేజ్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్. దేవిరెడ్డి, డైరెక్టర్లు డాక్టర్ సూర్యకుమారి, డాక్టర్ బి. అనిల్‌గుప్త, అరుంధతి, యాళ్ల పుష్పలతరెడ్డి, యాళ్ల మురళీధర్‌రెడ్డి, డాక్టర్ గోపీనాథ్ చిలకమారి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మైన్ గుడిపూడి నవీన్‌రావు, మాజీ ఓడిసీఎంఎస్ చైర్మైన్ కుడితి మహేందర్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, గొడుగు శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ్‌సారధిరెడ్డి, ఫ్లోర్ లీడర్ బి.అజయ్‌సారధిరెడ్డి, సీనియర్ వైద్యులు జ్యోతేంద్రనాథ్, జగన్మోహన్‌రావు, ఇంద్రసేనారెడ్డి, ప్రమోద్‌రెడ్డి, బి. నెహ్రూరాథోడ్, చంద్రశేఖర్, పర్కాల వినిల్‌రెడ్డి, ప్రతిభారెడ్డి, రంజిత్‌రెడ్డి, జిల్లా కోర్టు పీపీ చిలకమారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News