Monday, December 23, 2024

కాంగ్రెస్‌లో టికెట్ కోసం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ దరఖాస్తు

- Advertisement -
- Advertisement -

భార్యాభర్తలిద్దరికీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి
ఇద్దరిలో ఒక్కరికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న కాంగ్రెస్ వర్గాలు

మనతెలంగాణ/హైదరాబాద్:  ఖానాపూర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిఆర్‌ఎస్‌లో తనకు టికెట్ నిరాకరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె మంగళవారం కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ కోసం రేఖా నాయక్ తన పిఏ ద్వారా టికెట్ కోసం దరఖాస్తును పంపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో రేఖానాయక్ పిఏ ఈ దరఖాస్తు పత్రాలను అందజేశారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌లో చేరిన రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ సైతం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం బిఆర్‌ఎస్ పార్టీలో ఉంటూనే రేఖా నాయక్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే భార్తాభర్తలిద్దరికి కాంగ్రెస్‌లో టికెట్ కేటాయిస్తారా లేదా అన్న అంశంపై కొంత సందిగ్ధత నెలకొనట్టుగా తెలిసింది. వారిద్దరిలో ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా ఇద్దరికీ టికెట్ కావాలని వారు కాంగ్రెస్‌ను కోరుతున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే అధిష్టానం వీరిద్దరికి టికెట్ కేటాయిస్తుందా లేదా అన్న విషయమై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే పిసిసి వర్గాలు మాత్రం రేఖా నాయక్‌కు మాత్రం కచ్చితంగా టికెట్ దక్కే అవకాశం ఉందని, ఆమె భర్తకు ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకున్నా రానున్న రోజుల్లో మంచి పదవిని మాత్రం కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News