Monday, December 23, 2024

ప్రాజెక్టులు కట్టింది, యూనివర్సిటీలను నిర్మించిందే మేమే

- Advertisement -
- Advertisement -

భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీపై బిఆర్‌ఎస్ చేసిన విమర్శలకు భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడగడం విడ్డూరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కట్టింది ఎవరు..? యూనివర్సిటీలను కట్టింది ఎవరు..? కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నించారు ? ఎస్‌ఎల్ బిసి టన్నెల్ కు రూ.2 వేల కోట్ల నిధులను కేటాయిస్తే ఇప్పటికే పూర్తయ్యేదని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో 70 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును 9 ఏళ్లలో కనీసం 30 శాతం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయ లేదని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు ఒకటో తారీఖున ఇచ్చామని ఆయన తెలిపారు. నాలుగు కోట్ల మంది ప్రజలను తాను చేతులు జోడించి అడుగుతున్నానని, ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News