అమరావతి: భర్తను భార్య ఒడిలో పడుకోబెట్టుకొని ప్రియుడితో హత్య చేయించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుడివాడ అప్పల నాయుడు(38), జానకి(24) అనే దంపతులు గొలుగొండ గ్రామంలో నివసిస్తున్నారు. తాపీమేస్త్రి చింతల రాము(34)తో జానకి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త తెలియడంతో కూలీ పని మాన్పించాడు. తన భర్త ఉండగా కలిసి ఉండలేమని ప్రియుడి, ప్రియురాలు ఓ నిర్ణయానికి వచ్చారు. భర్తను తొలగించుకుంటే కలిసి ఉండొచ్చని భావించారు. ఆగష్టు 20న పట్టాలమ్మ తల్లి దేవాలయానికి భర్తను భార్య తీసుకెళ్లింది. తిరిగి వస్తుండగా తాండవ నది దాటగానే తన బహిర్భూమికి వస్తుందని బైక్‌ను ఆపమని భర్తకు చెప్పింది. ఇద్దరు కలిసి జీడితోటలోకి వెళ్లారు.
Also Read: ఎవరికి ఓటేసినా..బిజెపికే
కొంచెం సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందామని భర్తకు భార్య చెప్పింది. భర్త తలను ఒడిలో పెట్టుకొని ప్రేమగా నటించింది. అక్కడే కాపుకాసిన ఆమె ప్రియుడు వెనక నుంచి తలపై కర్రతో దాడి చేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే రాళ్లతో దాడి చేసి చంపేశారు. రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని వాహనదారులను నమ్మించే ప్రయత్నం భార్య చేసింది. అనుమానం వచ్చి కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తన ప్రియుడితో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.