Saturday, December 21, 2024

బిజెపోళ్లే ఇవిఎం ట్యాంపరింగ్ జరుగుతుందన్నారు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళా బిల్లు అంశంపై బిజెపి, కాంగ్రెస్ చిన్నచూపు చూస్తున్నాయని ఎంఎల్‌సి కవిత తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు ఇవ్వడంలో బిజెపి-కాంగ్రెస్ విఫలమయ్యాయని మండిపడ్డారు. ఇవిఎం ట్యాంపరింగ్ జరుగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయని, ఎంపి అర్వింద్‌పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని కవిత హెచ్చరించారు. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని కవిత ప్రశంసించారు. హర్యానాలో పదో తరగతి చదివిన వాళ్లే ఎన్నికలలో పోటీ చేయాలని చట్టం తీసుకొచ్చారని, మహిళలు ఎక్కువ చదువుకున్నవారు ఉండరు కావునా ఈ చట్టం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టారని, 2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేశారని, 2023వరకు పార్లమెంట్ లోని లోక్ సభలో ఎందుకు బిల్లు పాస్ చేయలేదని కవిత ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును చట్ట చేస్తేని మహిళకు రక్షణగా ఉంటుందని, మహిళలు రాజకీయంగా ఎదుగుతారని కవిత తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News