- Advertisement -
గ్యాంగ్‌టక్: మిజోరంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐజ్వాల్‌కు 20 కిలో మీటర్ల దూరంలో సైరింగ్ వద్ద దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు పని ప్రదేశంలో 40 మంది కూలీలు పని చేస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంద చిక్కుకున్నారని అధికారులు పేర్కొన్నారు. మిజోరం ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కూలీలు చనిపోవడం బాధాకరమైన విషయమన్నారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. గాయపడిన వారికి రూ.50 వేలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
Also Read: బిజెపోళ్లే ఇవిఎం ట్యాంపరింగ్ జరుగుతుందన్నారు: కవిత
- Advertisement -