Friday, November 22, 2024

ఎంపి అర్వింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

- Advertisement -
- Advertisement -

ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని బిఆర్ఎస్ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం తన నివాసంలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈవీఎంల ట్యాంపర్ పై దేశమంతా చర్చ జరుగుతున్న ఈనేపధ్యంలో బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ విషయాన్ని పరిశీలించాలని తాను సీరియస్ గా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. తమ పార్టీ న్యాయ విభాగం తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

భయాందోళనలు రేపేలా ఒక సామాజికవర్గం పేరును తీసుకొని నోటాకు ఓటేయాలని మాట్లాడడం శోచనీయమన్నారు. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఎల్ బీ నగర్ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. భవిష్యత్తులో పునరావృతంకాకుండా చర్యలకు ఉపక్రమించామన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు చేసిన వ్యాఖ్యలను తాను ఇప్పటికే ఖండించానని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడడం అన్నది కనీస బాధ్యత అని ఆమె సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News