Tuesday, April 1, 2025

గాంధీ భవన్‌కు దరఖాస్తుల వెల్లువ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ టిక్కెట్ ల కోసం గాంధీ భవన్‌కు దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 700లకు పైగా దరఖాస్తులు రాగా బుధవారం తాజాగా నల్లగొండ అసెంబ్లీ టిక్కెట్ కోసం ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరుపున గాంధీభవన్‌లో నల్లగొండ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్ రెడ్డి, నల్లగొండ జెడ్పీటిసి లక్ష్మయ్య, మాడుగల్ పల్లి జెడ్పీటిసి సైదులు, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దరఖాస్తు పాల్గొన్నారు. వ్యక్తిగత, రాజకీయాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కోమటిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News