వెల్దండ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాల నందిస్తూ సిఎం కెసిఆర్ ప్రజల గుండెల్లో చోటు సంపాదించాడని ,ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానం పొందిందని బిఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వచ్చే ఎన్నికలలో మా పార్టీకి ఎదురే లేదని మాదే అధికార మని కల్వకుర్తి ఎంఎల్‌ఏ జైపాల్ యాదవ్ అన్నారు.
మండల పరిదిలొని రాఘాయిపల్లి,కంటోనిపల్లి గ్రామాలలో నూతనం గా నిర్మించే గ్రామ పంచాయతీ భవనాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి,పెద్దాపూర్ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎల్‌ఏ జైపాల్ యా దవ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.గ్రామానికి చే రుకున్న వారిని ఆయా గ్రామాల సర్పంచ్‌లు అచ్చాలి,పెద్ది రా మకృష్ణ,గోరటి శ్రీనివాస్ లు ఘనంగా స్వాగతం పలికి శాలువాలు,పూలమాలలతో సన్మానించారు.
ఈ సందర్బంగా ఎంఎల్‌ఏ జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాల అ మలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని ,ప్రజలు అడిగిన పథకాలతో పాటూ అడగని ఎన్నో పథకాలను అం దిస్తూ సీఎం కేసిఆర్ పజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడని కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ పార్టీ అద్యక్షులు యెన్నం భూపతిరెడ్డి,జడ్పిటీసి ద్యాప విజితారెడ్డి,మండల వైస్ ఎంపిపి శాంతి గోపాల్ నాయక్,
డిఏఓ వెంకటేశ్వర్లు,మాజీ ఎంపిపి జయప్రకాష్ ,ఎంపిటీసిలు మోతీలాల్ నాయక్,గుత్తి వెంకటయ్య,చక్రవర్తి,,సర్పంచులు పత్యానాయ క్, అంజ్యానాయక్,మండల బిఆర్‌ఎస్ నాయకులు బాస్కరావు, జైపాల్ నాయక్,గోపాల్ నాయక్,నాగులూ నాయక్, అం జయ్య, శ్రీనూనాయక్, బాల్‌లక్ష్మయ్య, వెంకటేష్, ప్రసాద్, రా ములు, ఆర్‌కేగౌడ్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.