గద్వాల ప్రతినిధి : రానున్న అసెంబ్లీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్య క్రమంలో ఎలాం టి ఇబ్బందులు లే కుండా అన్ని ఏ ర్పాట్లు చేసేం దు కు వీలుగా ఉంటు ందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశిం చారు. బుధవారం రానున్న ఎన్నికలకు సంబంధించి దిస్త్రిబ్యూషణ్ సెంటర్, ఎన్నికల సామాగ్రి స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు గోనుపాడు సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి తరగతి గదులను, పరిసరాలు కాంపౌండ్‌ను పరిశీలిం చారు.
డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం పా లిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నందున అన్ని ఏర్పాట్లు చూడాలని అధికారు లను ఆదేశించారు. త్వరలో జరిగే శాసన సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నిక ల సామగ్రి ఈవీఎంలు, వివిప్యాట్లు పంపిణీ , నిలువ చే యుటకు గాను అనువు గా ఉంటుందని పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడి రూంలు, హాల్స్‌ను పరిశీలించి భద్రత తదితర వసతులపై అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.జిల్లా అదనపు కలెక్టర్లు అపూర్వచౌహన్, చీర్ల శ్రీనివాస్, ఎం ఆర్‌ఓ నరేందర్, కళాశాల ప్రిన్సిపల్ బాలాజీ, సంబంధిత అధికారులు ఉన్నారు.