Sunday, November 24, 2024

మోడీకి పాలనా వ్యవస్థ దాసోహం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రిగా గానీ, ప్రధాన మంత్రిగా గానీ నరేంద్ర మోడీ ఇంగ్లీషు భాషతో ఇబ్బందిపడిన విషయం ఎప్పుడూ పెద్దగా చర్చించలేదు. చౌదరి చరణ్ సింగ్ గానీ, హెచ్‌డి దేవగౌడ గానీ భాషలను కలబోసి నెట్టుకొచ్చారు. మోడీకి మాత్రం రెండవ భాష హిందీపై పట్టు సాధించారన్న ప్రశంస లభించింది. కానీ ఆయన ఇంగ్లీషుతో పడిన ఇబ్బంది, గుజరాతి, హిందీ ఆటంకం స్పష్టంగా కనిపిస్తుంది.అధికారులు మౌలికంగా ఏ రాష్ట్రానికి చెందిన వారనే దానితో సంబంధం లేకుండా, గుజరాత్ కేడర్‌కు చెందిన అనేక మంది అధికారులను మోడీ ఎంపిక చేసుకున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో సర్వశక్తిమంతమైన ప్రిన్సిపల్ కార్యదర్శి పదవితో పాటు అనేక ముఖ్యమైన స్థానాల్లో వారిని నియమించి ఒక భయాన్ని వ్యాపింప చేశారు. ప్రధానికి నివేదికలను, ఫైళ్ళ గురించి వారు హిందీలో కానీ, గుజరాతీ భాషలో కానీ వివరించేవారు.

ప్రధాని నరేంద్ర మోడీ చట్టబద్ధ పాలనను, అధికార యంత్రాంగాన్ని తనకు లోబడి ఉండేలా తయారు చేశారు. అధికార యంత్రాంగాన్నంతా రాజకీయమయం చేయడం వల్ల అది అసలు పనికి రాకుండాపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే కొంత కాలానికి నిజాయితీ, సమర్థవంతమైన పాలనా వ్యవస్థ మూలస్తంభాలు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటాయి. పౌర పాలనా వ్యవస్థపై రాజకీయ వ్యవస్థ ప్రభావం పడకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి రాజ్యాంగ నిర్మాతలు చాలా శ్రద్ధ వహించారు. ఎమర్జెన్సీలో మినహా మిగతా సమయంలో పాలనా వ్యవస్థ అంతా అలాగే కొనసాగింది. రాజకీయ నాయకులు, అధికారులు పరస్పర ప్రయోజనం పొందేలా, వారి మధ్య అక్రమ సాన్నిహిత్యం ఏర్పడకుండా పర్యవేక్షించే సంస్కృతిని కూడా రాజ్యాంగ నిర్మాతలు అభివృద్ధి చేశారు.

ఇటీవల పార్లమెంటులో పాసైన ఢిల్లీ సర్వీసుల చట్టం ఈ నీతి నియమాలకు భిన్నంగా, రాజకీయ నాయకులు, అధికారుల సంబంధాలకు చట్టబద్ధతను కల్పించింది. న్యాయ వ్యవస్థపైన రాజకీయ నాయకుల, పరిపాలనాధికారుల ఆధిపత్యానికి మద్దతుగా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పైన కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఎజెండా రుద్దడానికి అవకాశం కల్పిస్తోంది. ఏ ఫెడరల్ వ్యవస్థను నిలబెట్టడానకి అఖిల భారత సివిల్ సర్వీసు వ్యవస్థను ఏర్పాటు చేశారో, ఆ ఫెడరల్ వ్యవస్థను ఈ చట్టం దెబ్బ తీస్తోంది. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని రెండవ జాబితా ప్రకారం సివిల్ సర్వీస్ అధికారులను అదుపు చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. రాజ్యాంగం నిర్దేశించిన ఈ అధికారాలను ముఖ్యమంత్రి నుంచి లాగేసుకుని ఈ చట్టం ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి, హోం సెక్రటరీకి కట్టబెడుతోంది. రాజకీయ పాలనా మూలాలను అధికార యంత్రాంగం అదుపాజ్ఞల లో పని చేసేలా చేస్తోంది. సీనియర్ అధికారులు ముఖ్యమంత్రితో ఎన్నడూ విభేదించరని కాదు, ఒకే గుర్రాన్ని ఇద్దరు నడుపుతున్నప్పుడు వారిలో ఒకరు పక్కన ఉండక తప్పదని అధికారులు నమ్ముతారు.

పాలనా యంత్రాంగాన్ని పట్టపగలు రాజకీయమయం చేస్తున్న నరేంద్ర మోడీ, తన అనుభవాల మౌలిక సూత్రాలలో ఎన్నడూ తన ఈ ధిక్కారాన్ని దాచలేదు. శతాబ్దాల చట్టబద్ధతను, అధికార యంత్రాంగాన్ని మోడీ తనకు వ్యక్తిగతంగా విధేయమై ఉండే విధంగా తయారు చేశారు. బహిరంగంగా ఉండే ప్రజా పాలనా వ్యవస్థను బహిర్గతం కాని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు. మోడీలో మౌలికంగా ఏర్పడ్డ అభద్రతా భావంతో తనకు పోటీగా కనిపిస్తున్న అధికారుల నెత్తిన తన రాజకీయ ముఠాను అప్పుడప్పుడూ తీసుకొచ్చి కూర్చోపెడుతున్నారు. ప్రతి అధికారి తనకు విధేయుడుగా ఉండి, తన కలలకు అనుగుణంగా తనకు ప్రతిఫలం చెల్లిస్తున్నారా లేదా అని నిర్ధారించుకుంటారు.

తటస్థంగా ఉండే సివిల్ సర్వీసు అధికారుల వెన్నెముకను ఈ ఎత్తుగడతో విరిచేయడం వల్ల వారిలో చాలా మంది మోడీ తప్పుడు విధానాలతో కుమ్మక్కు కాక తప్పడం లేదు. ఈ విధంగా కుమ్మక్కయ్యి కొనసాగేవారు మోడీ పాలనకు బాగా సమకూరారు. ఎయిర్ పోర్టులు, ఓడ రేవులు, బొగ్గు గనులు, విద్యుదుత్పత్తి కేంద్రాల వంటి జాతీయ సంపదను తమ వారికి అప్పగించేస్తున్నప్పుడు, ఆ అధికారుల చేతి ముద్రలు తరువాతైనా బైటపడతాయన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. తమ అధినాయకుడిని ఏ మేరకు సంతృప్తి పరచారన్న విషయాన్ని భవిష్యత్తులో ఇవి వెల్లడిస్తాయి. బొగ్గు గనుల కేటాయింపు వివాదంలో అధికారులు జైలు పాలైన విషయం గుర్తు చేసుకోవడం మంచిది.

ముఖ్యమంత్రిగా గానీ, ప్రధాన మంత్రిగా గానీ నరేంద్ర మోడీ ఇంగ్లీషు భాషతో ఇబ్బందిపడిన విషయం ఎప్పుడూ పెద్దగా చర్చించలేదు. చౌదరి చరణ్ సింగ్ గానీ, హెచ్‌డి దేవగౌడ గానీ భాషలను కలబోసి నెట్టుకొచ్చారు. మోడీకి మాత్రం రెండవ భాష హిందీపై పట్టు సాధించారన్న ప్రశంస లభించింది. కానీ ఆయన ఇంగ్లీషుతో పడిన ఇబ్బంది, గుజరాతి, హిందీ ఆటంకం స్పష్టంగా కనిపిస్తుంది.అధికారులు మౌలికంగా ఏ రాష్ట్రానికి చెందిన వారనే దానితో సంబంధం లేకుండా, గుజరాత్ కేడర్‌కు చెందిన అనేక మంది అధికారులను మోడీ ఎంపిక చేసుకున్నారు.ప్రధాన మంత్రి కార్యాలయంలో సర్వశక్తిమంతమైన ప్రిన్సిపల్ కార్యదర్శి పదవితోపాటు అనేక ముఖ్యమైన స్థానాల్లో వారిని నియమించి ఒక భయాన్ని వ్యాపింపచేశారు. ప్రధానికి నివేదికలను, ఫైళ్ళ గురించి వారు హిందీలో కానీ, గుజరాతీ భాషలో కానీ వివరించేవారు. మోడీ ఎప్పుడూ రాసిఉన్న విషయాన్ని చదవడానికి ఇష్టపడే వారు కాదు.

గుజరాత్ భాషలో పని చేయడం అనేది ఆయనకు ఊహించని సదుపాయం. ప్రధాని అనుకూల ప్రైవేటు కంపెనీ ఉద్యోగి కూడా ఢిల్లీలో పెత్తనం చెలాయిస్తున్నాడు. ఈ రెండు పరిమితులు ఆయన ఎంపికను నిర్దేశిస్తున్నాయి. అందుకే తన అనుచరులను పంపించేయడానికి ఇష్టపడడం లేదు. తాను పరిశీలించని అధికారులను నియమించడానికి ఆయన మనసు అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఆయన కేబినెట్ కార్యదర్శి, హోం కార్యదర్శి పదవీ కాలాలను అందుకునే నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి చట్ట సవరణను చేపట్టి చట్టపరంగా ఉన్న నిషేధాన్ని పక్కన పెట్టి రిటైరైన వ్యక్తిని తన ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించుకున్నారు. సంజయ్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగిస్తూ, పొడిగిస్తూ పోయి ప్రస్తుతం ఆయన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌గా నియమించే వరకు వెళ్ళడం అలవాటుగా పరిణమించింది.

భయపెట్టడం అనేది మోడీకి ఇష్టమైన ఆయుధం. అది చాలా మంది అధికారులను ప్రభావితం చేసినట్టే అతన్ని కూడా ప్రభావితం చేసింది. శిక్షించే ఆదరించే ఎంపికలో ఆయన కాకపోవచ్చుకానీ, ఆయన దానిలో లోతుగా కూరుకుపోయారు. కొన్ని కంపెనీల విలువ మూడేళ్ళలో 5 వేల శాతం పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్‌ను క్రమబద్ధీకరించే సెబీ (సెక్యూరిటీ లండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) వేరే వేపు ఎలా చూస్తోంది? ఆ కాలంలో ఏం జరుగుతోందో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖాధికారులకు పట్టదు.బొగ్గును దిగుమతి చేసుకునేటప్పుడు గుత్తాధిపతులకు అనుకూలంగా ఇక్కడ లభించే ధర కంటే 8 నుంచి 10 శాతం ఎక్కువ ధరను నిర్ణయించి, ప్రభుత్వం కొనేలా నిబంధనలను రూపొందించే బొగ్గు గనుల శాఖలోని అధికారులు ఆ అదనపు సొమ్మును మన నెత్తిన రుద్దుతున్నారు. మోడీ తొమ్మిదేళ్ళ పాలనలో 12.51 లక్షల కోట్ల రూపాయల అప్పును బ్యాంకు అధికారులు, ఆర్థిక మంత్రిత్వశాఖలోని అధికారులు రద్దు చేశారు. ‘అకౌంటు పుస్తకాలను సరిచేయడం’ (క్లీనింగ్ అకౌంట్ బుక్స్) పేరుతో సర్దుబాటు చేస్తున్నామని బ్యాంకుల్లో శాశ్వత నిల్వలుగా ఉండాల్సిన అతి పెద్ద మొత్తాన్ని ఇలా నాశనం చేశారు.ఫలితంగా నీరవ్ మోడీ, మెహుల్ చౌక్ వంటి మోడీ ఆశ్రితులు, మోసగాళ్ళు విదేశాలకు పారిపోయి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.

నరేంద్ర మోడీ పాలనా కాలంలో ధనవంతులకు మరిన్ని సదుపాయాలు కల్పించి, వారిని అపరిమితమైన ధనవంతులుగా మార్చారు. పజ్జెనిమిది బిలియన్ డాలర్లున్న అంబానీ సంపద ఇప్పుడు 90 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడానికి అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక ప్రైవేటు విమానాన్ని ఏర్పాటు చేసిన అదానీ సంపద విలువ ఎనిమిదేళ్ళలో 8 బిలియన్ డాలర్ల నుంచి అనూహ్యంగా 140 బిలియన్ డాలర్లకు పెరిగింది. హిండెన్‌బర్గ్ నివేదిక కొట్టిన దెబ్బకు ఆయన సంపద కాస్తా 64 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ ఆ సంపద ఆకాశాన్ని తాకుతోంది. ఇలాంటి పనులన్నీ చాలా విజయవంతంగా జరగడానికి దోహదపడిన ‘సార్లు’, ఇతర మంచి స్నేహితులు అసాధారణమైన లబ్ధి పొందుతూ తరువాత రాజకీయాలలో కూడా చక్రం తిప్పుతున్నారు. రష్యా నుంచి కారు చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకుని అసాధారణ ధరకు అమ్మే రెండు ప్రైవేటు నూనె శుద్ధి కర్మాగారాలు గుజరాత్‌కు చెందినవే.

రష్యా దాడితో ఉక్రెయిన్ కకావికలమైన 2022 23వ సంవత్సరంలో భారత దేశం 98 మిలియన్ టన్నుల పెట్రో ఉత్పత్తులను 97 బిలియన్ డాలర్లకు ఎగుమతి చేసుకుంది. అంతకు ముందు ఏడాది (202122) అంతే పెట్రో ఉత్పత్తులను 67 బిలియన్ డాలర్లకు మనం పొందాం. పెట్రో ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన ఒఎన్‌జిసిని కానీ, ఐఒసిని కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఉక్రెయిన్ విధానం మోడీని ఆశ్రయించిన వారికి అసాధారణ లబ్ధి చూకూర్చిందన్న వాస్తవాన్ని ఇటు ప్రభుత్వం కానీ, అటు బిజెపి ప్రచారకులు కానీ చెప్పరు.

రష్యా నుంచి ముడి చమురును అతి తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నా మన దేశంలో పెట్రోల్ ధరలు తగ్గకుండా ఆకాశాన్నంటడానికి గల కారణాలేమిటో పెట్రోలియం శాఖా మంత్రి కానీ, ఆ మంత్రిత్వ శాఖలోని అధికారులు కానీ వెల్లడించరు. ప్రతి నిపుణుడు కొన్ని సందర్భాల్లో అవమానాలను ఎదుర్కొంటాడు. అలాంటి వారిలో బీర్‌బల్ కూడా ఒకడు. కాకపోతే అతను తెలివిగల వాడు. రాజకీయ పరిపాలనా న్యాయస్థానంలో చోటు దొరికే వరకు చాలా మంది రాజకీయ నాయకుల చుట్టూ వేలాడుతుంటారు. మనం గమనించినట్టు రాజ్యాంగపరంగా ఎంపికైన సభికులు మాత్రం నిమయాలను అనుసరిస్తూనే ఉంటారు. ఇలాంటి వారిని ప్రస్తుత పాలకుడు మెచ్చుకోడు. అతన్ని సంతృప్తి పరిచేవారినే అక్కున చేర్చుకుంటాడు.

మూలం
జవహర్ సిర్కార్
అనువాదం
రాఘవశర్మ
9493226180
(‘దవైర్’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News