- Advertisement -
వికారాబాద్: వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తాను కొడంగల్ నుంచే పోటీ చేస్తానని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో గురువారం కాంగ్రెస్ నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కొడంగల్‌ను దత్తత తీసుకుంటానన్న సిఎం కెసిఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. తాను చేసిన పనులకు శిలాఫలకాలు తప్ప బిఆర్‌ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జిల్లాలు పెంచి కొడంగల్‌ను ముక్కలు చేశారని దుయ్యబట్టారు.
కొడంగల్‌కు రెండేళ్లలో కృష్ణా జలాలు తెస్తామన్న హామీ ఏమైందని రేవంత్ రెడ్డి నిలదీశారు. సిఎం కెసిఆర్ మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.రాబోయే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ చేస్తానని, నియోజకవర్గ నేతలు తన తరుపున గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేస్తారని రేవంత్ తెలిపారు.
- Advertisement -