Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ పై పోటీ.. క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

- Advertisement -
- Advertisement -

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై పోటీ చేయడంపై సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఇటీవల సిఎం కెసిఆర్ గజ్వేల్ తోపాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కెసిఆర్ పై విజయశాంతి పోటీ చేయబోతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దీనిపై స్పందించిన ఆమె.. “కామారెడ్డిలో నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే.. బిజెపి కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బిజెపి గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత” అని విజయశాంతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News