Saturday, December 21, 2024

ప్రియుడితో కలిసి అశ్లీల వీడియోలు వీక్షిస్తుందని భార్యను దబ్బనంతో పొడిచి….

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: ఓ వ్యక్తి పోర్న్ వీడియోకు బానిస కావడంతో పాటు తన భార్య మరో వ్యక్తితో కలిసి పోర్న్ వీడియోలు వీక్షిస్తుందనే అనుమానం ఆమెపై దబ్బనంతో దాడి చేసిన సంఘటన గుజరాత్‌లో రాజకోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హరీష్ భూపాకర్(50), గీతా భూపాకర్(45) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు 24 ఏళ్ల కూతురు, 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. హరీష్ కొత్త మొబైల్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఫోర్న్ వీడియోలు వీక్షిస్తుండడంతో పాటు తన భార్యకు కూడా చూపించేవాడు. తన భార్య ఆమె బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పోర్న్‌వీడియోలు వీక్షిస్తుందని అనుమానాలు వ్యక్తం చేసేవాడు. మంగళవారం రాత్రి బెడ్‌రూమ్‌లో భార్యపై భర్త దబ్బనంతో దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. వెంటనే కూతురు వెళ్లి తల్లిని రక్షించింది. అప్పటికే గీతా కడుపు, చేతులు, కాళ్లపై దబ్బనంతో పొడిచాడు. తండ్రి నుంచి తల్లిని కాపాడడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించింది. కూతురు చేతులపై గాయాలయ్యాయి. గీతా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News