Monday, December 23, 2024

సెప్టెంబర్‌లో బ్యాంక్ సెలవులివే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సెప్టెంబరులో కూడా బ్యాంకులకు సెలవు ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందు చూసుకోండి. ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సెలవుల జాబితాను తనిఖీ చేయండి. సెప్టెంబర్ నెలలో అనేక పండుగలతో పాటు శని, ఆదివారాలు కలిపి మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉన్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉంటాయి. ఈ సెలవులు ఉన్నప్పటికీ యుపిఐ, ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలను వినియోగించుకునే వెసులుబాటు ఉంది.

బ్యాంక్ సెలవుల జాబితా
సెప్టెంబర్ 3 :- ఆదివారం బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 6, 7 : శ్రీ కృష్ణ జన్మాష్టమి బ్యాంకులకు సెలవు (రాష్ట్రాల వారీగా వేర్వేరుగా)
సెప్టెంబర్ 9 :- రెండో శనివారం సెలవు
సెప్టెంబర్ 10 :- ఆదివారం బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 17 :- ఆదివారం బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 19, 20 :- గణేష్ చతుర్థి సెలవు (ప్రాంతాల వారీగా)
సెప్టెంబర్ 22- : శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం కొచ్చి, పనాజీ, త్రివేండ్రంలో సెలవు
సెప్టెంబర్ 23 :- నాలుగో శనివారం సెలవు
సెప్టెంబర్ 24 :- ఆదివారం సెలవు
సెప్టెంబర్ 25 :- శ్రీమంత్ శంకర్‌దేవ్ జన్మదినం సెలవు
సెప్టెంబర్ 27 :- మిలాద్-ఎ- షరీఫ్ కారణంగా జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, త్రివేండ్రంలోసెలవు
సెప్టెంబర్ 28, 29 :- ఈద్-ఇ-మిలాద్ కారణంగా పలు ప్రాంతాల్లో సెలవు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News