Saturday, November 23, 2024

పెరుగుతున్న ఆహార ధరలతో ద్రవ్యోల్బణం ముప్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అంశాలపై ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ) పర్యవేక్షించి, తదనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తోంది. ఇటీవల ఆహార ధరల పెరుగుదల నేపథ్యంలో ఆర్‌బిఐ ద్రవ్యోల్బణంపై దృష్టిపెట్టింది. ఈమేరకు తాజా ఎంపిసి మినిట్స్ వివరాలను వెల్లడించింది. తాజా పంటలు రావడంతో కూరగాయల ధరలు తగ్గే అవకాశముంది. ఆహార ధరలతో ముప్పు ఉంది, ఎల్ నినో పరిస్థితుల నుంచి ద్రవ్యోల్బణం దృక్పథం, అంతర్జాతీయంగా ఆహార ధరల హెచ్చుతగ్గులు, రుతుపవనాల వంటి వాటిని పరిశీలించాలని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నట్టు ఎంపిసి ఆగస్టు మీటింగ్ మినిట్స్‌లో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News