Saturday, September 21, 2024

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణ : కోదండరాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రెండు నెలల ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములు, అసైన్డ్ భూములు లాక్కుని వాటిని అమ్ముకుంటోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టనున్నామన్నారు. దీనిపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై విస్తృత కార్యాచరణ చేపట్టనున్నామన్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోగా నియోజకవర్గ స్థాయిలో పార్రీట కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 30న 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా చార్జ్‌షీట్ విడుదల చేస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను నిర్వహించేందుకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఎల్ విశ్వేశ్వర రావు చైర్మన్‌గా ఎన్నికల నిర్వహణ కమిటి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోవు ఎన్నికల్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్తిని రంగంలోకి దించాలన్న గద్దర్ ప్రతిపాదనను ఆలోచించాల్సిన అవసరం ఉందని కోదండరాం అన్నారు. కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాడేందుకు చర్చలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News