Monday, December 23, 2024

దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్‌వన్

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: శాం తిభద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీసులు ముందు ఉన్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ నూ తన భవనాన్ని డిజిపి అంజనీకుమార్, ఎంపి రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సహకారంతో సుమారు 2 ఎకరాల సువిశాలమైన స్థలం లో రూ.4.5 కోట్ల వ్యయంతో మైలార్‌దేవ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ ముందు ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రా ష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడం లో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన పోలీసింగ్ కోసం ప్రభుత్వం పోలీస్ శాఖకు పో లీసు భవనాలు, వాహనాలు, మ్యాన్ పవర్, వెల్ఫేర్ తదితర సౌకర్యాలు కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నామని తెలిపారు.

ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. సిసి టీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు విజయవంతం అయ్యారని అన్నారు. దేశంలో ఉన్న సిసిటివిల్లో 64శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. షీటీమ్స్, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని భద్రత మన రాష్ట్రంలో మాత్రమే ఉందని అన్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సహాయ సహకారాలందించిన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ కార్పొరేషన్ (టిఎస్‌ఐఐసి) మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డిని హోంమంత్రి మహమూద్ అలీ సత్కరించారు.

సైబరాబాద్ కమీషనర్ స్టిఫెన్ రవీంద్ర, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, చేవెళ్ళ ఎంపి జి. రంజిత్ రెడ్డి , రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ టి. శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ పోలీస్ కమిషనర్ అవినాష్ మ హంతి, డిసిపిలు జగదీశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్, రి తిరాజ్, నితికా పంత్, ఏడిసిపి రష్మి పెరుమాళ్, ఏ సీపీ గంగాధర్, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ మధు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News