Sunday, December 22, 2024

ఆలయ హుండీలో రూ. 100 కోట్ల చెక్.. భక్తుడి ఖాతాలో బ్యాలెన్స్ మాత్రం..

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం హుండీలో ఓ భక్తుడు రూ. 100 కోట్ల చెక్ వేశాడు. అయితే ఆలయ అధికారులు సంబంధిత బ్యాంకులో చెక్ డిపాజిట్ చేయగా ఆ భక్తుడి బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 17 మాత్రమే ఉన్నట్లు తేలింది. చెక్‌కు సంబంధించిన ఫోటో గురువారం సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. చెక్‌పై బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి సంతకం ఉంది. కొటక్ మహీంద్ర బ్యాంకుకు చెందిన చెక్‌పై భక్తుడు తేదీ మాత్రం రాయలేదు. విశాఖపట్నంలోని కొట్ మహీంద్ర బ్యాంకులో భక్తుడు ఖాతాదారుడిడని అర్థమవుతోంది.

హుండీని లెక్కిస్తున్న సమయంలో ఆలయ అధికారులకు రూ. 100 కోట్లు స్వామివారికి కానుకగా సమర్పిస్తూ భక్తుడు వేసిన చెక్ లభించింది. చెక్‌ను అధికారులు ఎగ్జిక్యూటివ్ అధికారి దృష్టికి తీసుకెళ్లగా ఇందులో ఏదో తేడా కొడుతున్నట్లు ఆయన అనుమానించారు. సంబంధిత బ్యాంకుకు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. చెక్‌పై సంతకం చేసిన వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ. 17 మాత్రమే నగదు ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది నిర్ధారించడంతో కంగుతినడం ఆలయ అధికారుల వంతైంది.

హుండీలో చెక్ వేసిన ఖాతాదారుడి వివరాలు సమర్పించాలని బ్యాంకును కోరుతూ ఒక లేఖ రాయాలని ఆలయ అధికారులు నిర్ణయించుకున్నారు. ఆలయాన్ని మోసం చేసే ఉద్దేశంతో ఈ చెక్ వేశాడా లేక మరేదైనా ఉద్దేశంతోనా అన్న విషయమై అధికారులు ఆరా తీయనున్నారు. ఖాతాదారుడిపై చెక్ బౌన్స్ కేసు పెట్టే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News