Saturday, December 21, 2024

కేబిఆర్ పార్కు అభివృద్ధికి మరిన్ని చర్యలు: జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేబిఆర్ పార్కు మరింత అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కెబిఆర్ పార్కు సందర్శించిన కమిషనర్ వాకర్స్‌తో కలియ తిరుగుతూ కావాల్సిన సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు.ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ వాకర్స్ సూచించిన విధంగా పనులను వెంటనే చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ మరమ్మత్తులు, మురుగు నీరు లోపలికి రాకుండా, వర్షపు నీరు బయటికి పోకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అంతేకాకుండా గ్రీనరీ, ఇతరత్ర వేస్ట్ ను వేర్వేరు చేసి కంపోస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని యుబిడి, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్క్ లో అవసరమైన స్ట్రీట్ లైట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రే, యుబిడి అదనపు కమిషనర్ వి.కృష్ణ, డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News