Sunday, November 24, 2024

పెలికాన్ సిగ్నల్స్‌తో రోడ్డుప్రమాదాలను నివారించవచ్చు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ సిటిబ్యూరోః  పెలికాన్ సిగ్నల్స్‌తో పాదచారుల మరణాలను నియంత్రించవచ్చని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మాదాపూర్‌లోని గూగుల్ కార్యాలయం జంక్షన్ వద్ద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్‌ను శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు దాటే సమయాల్లో ఎక్కువగా పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారని అన్నారు. పెలికాన్ పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డుదాటే సమయంలో జరిగే ప్రమాదాలను నియంత్రించవచ్చని అన్నారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 44 పెలికాన్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. పాదాచారుల భద్రతాకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్‌ను మెరుగుపరిచేందుకు ఎస్‌సిఎస్‌సి ట్రాఫిక్ వలంటీర్లు అందిస్తున్న సేవలను అభినందించారు. ‘సేఫ్ సిటీ ప్రాజెక్ట్‘ లో భాగంగా పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరిన్ని పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్దన్ మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 44 సిగ్నల్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు ద్వారా పెడెస్ట్రియన్ క్రాసింగ్‌లో జరిగే ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు.

పాదాచారులు ఎక్కువగా రోడ్ దాటే ప్రదేశాలను గుర్తించి అక్కడ పెలికాన్ సిగ్నల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ సందీప్, మాదాపూర్ ట్రాఫిక్ ఏడిసిపి శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌సిఎస్‌సి ట్రాఫిక్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘునందన్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News