Friday, November 15, 2024

డబ్లూడబ్లూఈ స్టార్ బ్రేవ్ వయెట్ మృతి

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడా: ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్లూడబ్లూఈ) మాజీ ఛాంపియన్ బ్రేవ్ వయెట్ (36) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేగాక డబ్లూడబ్లూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ట్రిపుల్ హెచ్ లెవెస్కీ కూడా ధ్రువీకరించాడు. మూడు సార్లు డబ్లూడబ్లూఈ ఛాంపియన్‌గా ఉన్న బ్రేవ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కెరీర్‌లో బ్రేవ్ వయెట్ ఒకసారి డబ్లూడబ్లూఈ ఛాంపియన్‌షిప్‌ను రెండు సార్లు యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాడు. కాగా, బ్రేవ్ వయెట్ కిందటి ఏడాది వరకు డబ్లూడబ్లూఈ పోటీల్లో తలపడ్డాడు. కానీ కొంతకాలంగా అతను అనారోగ్యం బారి పడ్డాడు.

ఆ తర్వాత ఈ పోటీలకు దూరంగా ఉంటున్నాడు. బ్రేవ్ వయెట్ అసలు పేరు విండం రొటుండా. అతని కుటుంబంలో మరికొందరు రెజ్లర్లు కూడా ఉన్నారు. బ్రేవ్ తండ్రి మైక్ రొటుండా, తాతా బ్లాక్‌జాక్ ముల్లిగన్‌లు కూడా ప్రొఫెషనల్ రెజ్లర్లు కావడం విశేషం. అతని తండ్రి మైట్ రొటుండా డబ్లూడబ్లూఈ హాల్ ఆఫ్ ఫేమర్‌గా కూడా నిలిచాడు. చిన్న వయసులో బ్రేవ్ వయెట్ అకాల మృత్యువాత పడడం క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వయెట్ మృతిపై ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News