Monday, December 23, 2024

నేరుగా కూలీల ఖాతాల్లోకి ఉపాధి నిధులు

- Advertisement -
- Advertisement -

ఆధార్ అనుసంధానం నెలాఖరు వరకు గడువు

సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఉపాధి నిధులు

మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెల్లింపులపై కేంద్రం మరోసారి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం కింద వేతనాలను చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను జనవరిలో తీసుకువచ్చిన విషయం విధితమే. కాగా ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు ఈ నెల 31 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. ఇకపై తేదీని పొడిగించే ప్రసక్తే లేదని, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మొదట చెల్లింపు విధానానికి సంబంధించి మార్చి 31 వరకు గడువు నిర్ణయించింది. తర్వాత గడువును జూన్ 30 వరకు, ఆ తర్వాత ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ వచ్చింది. ఇకపై గడువును పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

సెప్టెంబర్ ఒకటి నుంచి ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్‌ను అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 90 శాతం కార్మికుల ఆధార్ అనుసంధానం పూర్తయ్యిందని, ఇకపై గడువు పొడిగించబోమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడిపోయాయి. అస్సాంలో 42 శాతం, అరుణాచల్ ప్రదేశ్‌లో 23 శాతం, మేఘాలయలో 70 శాతం, నాగాలాండ్‌లో 37 శాతం మంది ఆధార్ సీడింగ్ పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. వందశాతం ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. లబ్ధిదారులను ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఎబిపిఎస్) కిందకు మారేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News