Monday, December 23, 2024

ఢిల్లీ జి20 శిఖరాగ్ర సదస్సుకు పుతిన్ దూరం

- Advertisement -
- Advertisement -

మాస్కో : భారతదేశంలో సెప్టెంబర్ నెలలో జరగనున్న జి20 శిఖరాగ్ర సదసుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదని క్రెమ్లిన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధమేనని దీనికి కారణమని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ప్రకటించారు. ‘జి20 సమ్మిట్ కోసం వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవు. ప్రస్తుతం మా దృష్టి సైనిక చర్య మీదే ఉంది’ అని దిమిత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌లో పుతిన్ వర్చువల్‌గా పాల్గొంటారా? లేదా? అనే విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదే సమయంలో వాగ్నర్ మెర్సినరీ అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి వ్లాదిమిర్ పుతిన్‌పై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది జరగబోయే జి20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో ఈ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. ఈ సమ్మిట్‌కు 29 మంది దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News