Tuesday, January 21, 2025

పాలకుర్తి హరిత హోటల్ నమూనాల పరిశీలన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రూ.25 కోట్లతో పర్యాటక శాఖ ద్వారా నిర్మించనున్న హరిత హోటల్ నిర్మాణ నమూనాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ శాఖ అధికారులు హోటల్ నిర్మాణ నమూనాలను మంత్రి దృష్టికి తేగా… అధికారులకు తగు సూచనలు సలహాలు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పాలకుర్తి ప్రాంతంలో ఈ హోటల్ నిర్మాణం చేపట్టడం ద్వారా యాత్రికులకు బస చేయడానికి అనుకూలంగా వుంటుందన్నారు. ఈ హోటల్ ను మంజూరు చేసి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Haritha Hotels

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News