Monday, January 20, 2025

5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కార్ పచ్చజెండా ఊపింది. తెలంగాణలో డిఎస్‌సి ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి), 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పిఇటి) పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు (డిఎస్‌సి) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు డిఎస్‌సికి అర్హులు.

అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డిఎస్‌సికి పంపుతారు. అనంతరం ఆయా జిల్లాల డిఎస్‌సిలు నియామకాలు చేపడతాయి. మరోవైపు సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రభుత్వం జారీ చేయనుంది. ఇప్పటివరకు గత 16 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలోనే.. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. దీంతో వీరు ఇప్పుడు రెగ్యులర్ ఉపాధ్యాయులుగా కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం పట్ల రాష్ట్ర ఎస్‌సి అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్- 1 పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను వచ్చే నెల 9 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ఉపాధ్యాయ పోస్టుల వివరాలు

స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఎ) 1739
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి) 2575
లాంగ్వేజ్ పండిట్(ఎల్‌పి) 611
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పిఇటి) 164
…………………
మొత్తం 5,089
————-

జిల్లాల వారీగా టీచర్ పోస్టుల ఖాళీలు

క్రమ సంఖ్య జిల్లా పేరు ఎస్‌ఎ ఎస్‌జిటి ఎల్‌పి పిఇటి మొత్తం
1. అదిలాబాద్ 54 206 13 2 275
2. అసిఫాబాద్ 49 214 24 2 289
3. భద్రాద్రి 76 101 7 1 185
4. హన్మకొండ 21 21 5 7 54
5. హైదరాబాద్ 116 163 57 22 358
6. జగిత్యాల 50 53 37 8 148
7. జనగాం 23 29 17 7 76
8. జయశంకర్ 12 38 17 7 74
9. జోగులాంబ 34 77 27 8 146
10. కామారెడ్డి 97 86 12 5 200
11. కరీంనగర్ 22 52 18 7 99
12. ఖమ్మం 89 83 13 10 195
13. మహబూబాబాద్ 35 69 19 2 125
14. మహబూబ్‌నగర్ 23 47 19 7 96
15. మంచిర్యాల 36 58 16 3 113
16. మెదక్ 70 48 28 1 147
17. మేడ్చల్ 25 45 7 1 113
18. ములుగు 16 33 15 1 147
19. నాగర్‌కర్నూల్ 61 36 15 2 114
20. నల్గొండ 86 102 25 6 219
21. నారాయణపేట 71 62 20 1 154
22. నిర్మల్ 16 91 4 4 115
23. నిజామాబాద్ 96 183 21 9 309
24. పెద్దపల్లి 30 7 5 1 43
25. రాజన్న సిరిసిల్ల 23 64 12 4 103
26. రంగారెడ్డి 48 117 25 6 196
27. సంగారెడ్డి 80 174 24 5 309
28. సిద్దిపేట 60 49 24 8 141
29. సూర్యాపేట 48 78 23 4 185
30. వికారాబాద్ 102 77 12 0 191
31. వనపర్తి 43 19 9 5 76
32. వరంగల్ 56 55 21 6 138
33. యాదాద్రి 39 38 20 2 99

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News