మహబూబ్‌నగర్ బ్యూరో : మన్యంకొండ దేవాలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి రోప్ వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. విదేశాల్లో ఉన్న కేబుల్ కార్ కంటే మన రోప్‌వే మరింత అద్బుతంగా ఉండనుందని ఆయన వివరించారు. మన్యంకొండ రోప్ వేకు అనుసంధానంగా కొండమీద ఏర్పాటు చేయనున్న ల్యాండింగ్,ల్యాండ్ స్కేపింగ్, స్కైవాక్, అన్నదాన సత్రం,లడ్డు కౌంటర్,కొనేరు తుది డిజైన్లను మంత్రి ఆమోదించారు.
శుక్రవారం మంత్రుల నివాస స ముదాయంలో తుది డిజైన్లను కన్సల్టెంట్లతో ఎం పీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించా రు. పేదల కొంగుబంగారం తెలంగాణ తిరుపతి అ యినా మన్యంకొండ దేవాలయాన్ని యాదాద్రి, వే ములవాడ తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దుతామ ని,అధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామ ని మంత్రి తెలిపారు.మన్యంకొండవద్ద చేపడుతున్న రోప్ వేను స్విట్టర్లాండ్ , దక్షిణ కొరియాలో ఉన్న రోప్‌వేల కంటే అద్బుతంగా తీర్చిదిద్దుతామన్నారు.
కేబుల్ కార్ దిగి స్కై వాక్ ద్వారా నేరుగా గుడిలోకి
కొండపైన కేబుల్ కార్ ల్యాండింగ్ అయిన తర్వాత భక్తులు నేరుగా దైవదర్శనానికి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా స్కైవే నిర్మాణం చేపడుతున్నామని అధునాతన అన్నదాన సత్రం, లడ్డు కౌంటర్ , కొనేరు నిర్మాణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.
కొండపైన దిగువన ల్యాండ్ స్కేపింగ్ అత్యద్భుత ంగా ఉండనున్నాయన్నారు. రోప్ వే స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియా, రెస్టారెంట్ , ల్యాండ్ స్కేపింగ్ , విశాలమైన పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తామన్నారు.
రోప్ వే స్టేషన్ వద్ద ఆధునిక హంగులు
కొండ దిగువన అలివేలు మంగ దేవాలయం,మెయిన్ రోడ్డుకు కు డివైపు నుంచి కొండపైకి సు మారు కిలో మీటరు మేర రోప్ వే నిర్మించనున్న ఈ రోప్ వే వల్ల పర్యాటకులు, భక్తుల సంఖ్య మరింత గా పెరుగుతుంద ని, అందుకు అనుగుణంగా ఆధునిక హక్కులతో స కల సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఎంత ఖర్చు అయినప్పటికి పేదల తిరుపతి మన్యంకొండను స ర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. స ంస్కృతి సంప్రదాయాలు, ఎకో టూరిజం కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పర్యాటక శాఖ ఓఎస్డి సత్యనారాయణ, టూరిజం కన్సల్టెంట్ కల్పేష్ పటేల్ , ఇతర అధికారులు ఉన్నారు.