Monday, December 23, 2024

కువైట్‌లో రోడ్డు ప్రమాదం… నలుగురు తెలుగువారు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన గౌష్‌బాషా వివాహం చేసుకొని బెంగళూరు స్థిరపడ్డారు. బెంగళూరు నుంచి కుటుంబంతో కలిసి కువైట్‌కు వెళ్లారు. కువైట్‌లో తన భార్య ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమచారం. మృతి చెందిన వ్యక్తికి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి మృతదేహాలు చూసే వరకు నిర్ధారించలేమని గౌస్‌భాషా బంధువులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News