Thursday, December 26, 2024

దేవరకద్రలో ప్రియుడిని నరికిన ప్రియురాలి భర్త

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రియుడిని భర్త హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బస్వాయపల్లి గ్రామంలో దయ్యాల నాగరాజు అనే వ్యక్తి 15 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. దాంపత్యం సాపీగా సాగుతున్న క్రమంలో ఆమె బోయ నాగరాజుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టాడు. కానీ ఇద్దరు మళ్లీ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో ప్రియుడ్ని హత్య చేయాలని భర్త ప్లాన్ వేశాడు. బోయ నాగరాజు తన స్నేహితులు యాదయ్య, కొండన్నతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. మార్గమధ్యలో ముళ్లకంప వేసి వారిని ప్రియురాలు భర్త అడ్డుకున్నాడు. ముగ్గురు ద్విచక్రవాహనంపై వచ్చి అక్కడ ఆగడంతో గొడ్డలి తీసుకొని ప్రియుడు తలపై భర్త నరకడంతో అక్కడికక్కడే చనిపోయాడు. యాదయ్య, కొండన్న వెళ్లి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ప్రియుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: అంగన్‌వాడీలకు తీపి కబురు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News