Sunday, December 22, 2024

గ్లామర్‌తో మురిపిస్తోంది

- Advertisement -
- Advertisement -

యంగ్ బ్యూటీ కృతిశెట్టి బ్లాక్‌బస్టర్ మూవీ ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీనిచ్చింది. అనంతరం ఈ భామకు అరడజను పైగా సినిమాలు వరుస ఆఫర్లు రాగా వాటన్నింటినీ చేస్తూ వచ్చింది. అయితే కథల విషయంలో పెద్దగా ఫోకస్ చేయని కృతి ఎంత త్వరగా క్రేజ్ తెచ్చుకుందో అంతే త్వరగా ఫ్లాపుల్లో పడిపోయింది.

ప్రస్తుతం మలయాళంలో టోవినో థామస్ హీరోగా చేస్తున్న అజేయంతే రంధం మోషనం సినిమాలో నటిస్తున్న కృతి శెట్టి ఆ సినిమాతో పాటుగా తమిళంలో జయం రవి హీరోగా చేస్తున్న జినీ సినిమాలో అవకాశం అందుకుంది. తెలుగులో శర్వానంద్, శ్రీరాం ఆదిత్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది.

ఇక 2023 లో కేవలం ఒకే ఒక్క సినిమా రిలీజ్ కాగా 2024లోనే ఈ బ్యూటీ చేస్తున్న సినిమాల రిలీజ్ లు ఉంటాయని తెలిసింది. అయితే 2024లోనే కృతి శెట్టి తిరిగి ఫాంలోకి వస్తుందని ఆశించవచ్చు. ఇక ఈమధ్యన కృతి శెట్టి గ్లామరస్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడిచేస్తోంది. దీంతో ఈ బ్యూటీ అభిమానులను మైమరపిస్తుండడంతో పాటు ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో కూడా పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News