Sunday, December 22, 2024

దివ్యాంగులకు అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

233 మందికి ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా రూ. 4016 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని దివ్యాంగుల పట్ల మానవతా దృష్టి, ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్న నాయకుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర ఆర్ధిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో టిటిసి భవన్‌లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 233 మంది దివ్యాంగులకు 17 లక్షల రూపాయల విలువైన ఉచితంగా ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వెయ్యి రూపాయలకు మించి పింఛన్ ఇవ్వలేదని రాష్ట్రంలో రూ.3016 నుండి రూ.4016 కు పెంచి దివ్యాంగుల పింఛను ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 5వేల 261 మందికి పింఛను అందిస్తున్నట్లు దివ్యాంగులను చిన్నచూపు చూసేవారే నిజమైన వికలాంగులని ఎద్దేవా చేశారు.దివ్యాంగులు మంచి మనసు గలవారని జిల్లాలో గతంలో కూడా దివ్యాంగులకు ఉపకరణాలు అందించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా డివిజన్ల వారీగా ఉపకరణాలను అందిస్తామని సిద్దిపేటలో భవిత సెంటర్. సైకోవేటర్ పార్క్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, సుధా చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News